1 August, 2026 | 1:07 AM

ఎర్రవల్లి సర్కారు బడికి కొత్త రంగులు

01-08-2026 12:00 AM

ఎర్రవల్లి  జులై 31: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనానికి ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి అనిత కృష్ణసాగర్ ఆధ్వర్యంలో రంగులు వేయించారు. దీంతో పాఠశాల భవనం ఆకర్షణీయంగా మారగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు.

సర్పంచ్ అనిత కృష్ణసాగర్ మాట్లాడుతూ, పాఠశాల గోడలపై విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా విద్యా సంబంధిత వాల్ ఆరట్స్, ఆకర్షణీయమైన పెయింటింగ్లు కూడా త్వరలో వేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తీసుకుంటున్న చర్యలను గ్రామస్థులు అభినందించారు. పాఠశాల పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు కృషి కొనసాగుతుందని సర్పంచ్ తెలిపారు.