05-01-2026 01:31:07 AM
తంగళ్ళపల్లి, జనవరి 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నెమలికొండ రమణాచారి స్వామి హాజరై ఆశీర్వచనాలు అందించారు. నూతన ఆలయ అధ్యక్షుడిగా బండి చైతన్య ఎన్నికై దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో తంగళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ఉపాధ్యక్షులుగా ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, కోడం రమేష్, బత్తిని మల్లేశం, సామల గణేష్, సామల రమేష్ ప్రధాన కార్యదర్శిగా రాపెళ్లి ఆనందం, కోశాధికారులుగా సుద్దాల కరుణాకర్, ఆసాని లక్ష్మారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా మచ్చ విజయ్, క్యారం జగత్, సాంస్కృతిక కార్యదర్శులుగా పడిగల రాజు, జూకంటి శివశంకర్,ప్రచార కార్యదర్శులుగా చెన్నమనేని ప్రశాంత్, ఎడమల శ్రీధర్ రెడ్డి, అలాగే కార్యవర్గ సభ్యులుగా ఎడమల బాల్ రెడ్డి, రంగు అంజయ్య, కొండన్నపేట ఆంజనేయులు, జిందం సంతోష్, దొందడి రమేష్, విశ్వనాథుల రమేష్, పరికిపండ్ల రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం మరియు ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. మొదటి కమిటీ అధ్యక్షుడు కోడి అంతయ్య మాట్లాడుతూ 50 రూపాయల సభ్యత్వంతో ప్రారంభమైన కమిటీ 40 వేల సభ్యత్వాల వరకు ఎదిగిందని, తన హయాంలో ఆలయ అభివృద్ధికి స్వంత ఖర్చుతో అనేక పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.