05-01-2026 01:29:22 AM
యువతలో చైతన్యం కల్పించేందుకు కృషి
సభ్యత్వం ఉంటేనే బీఫాం
50 వేల సభ్యత్వం లక్ష్యంగా ముందుకు
ఏఐఎఫ్‌బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి
కరీంనగర్, జనవరి 4 (విజయ క్రాంతి): ప్రజల్లో సుభాష్ చంద్రబోస్ ఆశయాల తీసుకువెళ్లి యువతలో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తామని అలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్ బి) రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విజయ క్రాంతితో మాట్లాడుతూ గతంలో ఏఐఎఫ్ బీ బీఫాం మీద గెలిచి చాలామంది పార్టీలు మారారని, ఈసారీ అలా కాకుండా ఏఐ ఎఫ్ బి సభ్యత్వం ఉంటే బీఫాం ఇస్తామని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939లో స్థాపించిన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. బీజేపీ పార్టీ మాత్రమే తమకు ప్రత్యర్ధి అని, బీజేపీ పాలనపై ప్రజల్లో చైతన్యం చేస్తామన్నారు.
భారత రాజకీయాల్లో ఏఐఎఫ్ బి పుంజుకుని ఒక శక్తిగా మారేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో రాష్ట్ర కమిటీతోపాటు 33 జిల్లాల్లో జిల్లా కన్వీనర్, కో-కన్వీనర్లను నియమిస్తామన్నారు. అనంతరం జిల్లా, మండల, గ్రామ కమిటీలతో పాటు బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ఏఐ ఎఫ్ బి ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. 50 వేల సభ్యత్వం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే అన్ని పార్టీలు ఇస్తున్న మాదిరిగా కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని, తెలంగాణలో ఏఐఎఫ్ బి బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏఐఎఫ్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి వివరించారు.