calender_icon.png 9 January, 2026 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజాపై కేంద్రం నిషేధం

08-01-2026 02:12:40 PM

హైదరాబాద్: హైదరాబాద్ లో భారీగా చైనా మాంజా పట్టుబడింది. దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. చైనా మాంజా స్వాధీనం ఘటనలో 103 కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 143 మందిని అరెస్టు చేశారు. ఈ చైనా మాంజాను దుకాణదారులు ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తెప్పిస్తున్నట్లు పోలీసు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) మాట్లాడుతూ... దేశంలో చైనా మాంజా వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని పేర్కొన్నారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో భారీగా మాంజాను స్వాధీనం చేసుకున్నామని, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చైనా మాంజా విక్రయిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు నోటీసులు ఇచ్చామని, చైనా మాంజాకు గాంజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ చేస్తారని సీపీ సజ్జనార్ వివరించారు.