05-01-2026 01:32:37 AM
చల్మెడ వైద్య, విద్యాసంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహారావు
ముకరంపుర, జనవరి 4 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసి కన్వెన్షన్ హాల్ నందు పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో రూపొందిన క్యాలెండర్ ను వేములవాడ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ వైద్య విద్య సంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహారావు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.
ఒకవైపు సేవ కార్యక్రమాలు చేస్తూనే.. సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పద్మనాయక వెలమ సంఘం ఉపాధ్యక్షులు గండ్ర సంపత్ రావు, ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాష్ రావు, కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్, వాల శంకర్‌రావు, చిట్నేని మోహన్ రావు, సుంకిశాల సంపత్ రావు, జూపల్లి మాధవ రావు, చిట్నేని రఘురాం రావు, పల్లెపాటి వేణుగోపాల్ రావు, ఐల్నేని సుధాకర్ రావు, తాండ్ర అశోక్ రావు, గండ్ర మంజుల, తదితరులు పాల్గొన్నారు.