calender_icon.png 8 December, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు

07-12-2025 05:05:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్(TMEA) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశములో TMEA జిల్లా గతములో చేసిన కార్యవర్గము వారి కాలంలో చేసిన పూర్తి నివేదిక సమర్పించడం జరిగింది. రాబోవు రెండు సంవత్సరాల కాలమునకు జవాద్ హుస్సేన్ అధ్యక్షులుగా, ఇంతియాజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా మతీన్ అసోసియేట్ అధ్యక్షులుగా మొయిజుద్దీన్ ఆర్థిక కార్యదర్శిగా, నజీర్ ఖాన్ ముఖ్య సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. షేక్ హయత్, రిటైర్డ్ ఎంఈఓ, ప్రస్తుత జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో సంబంధించిన ముస్లిం ఉద్యోగులు పాల్గొన్నారు.