07-12-2025 04:59:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉద్యోగులకు రైతులకు ఎంతో సేవలు చేసిన కామ్రేడ్ నారాయణ సార్ సేవలు మరువలేనివని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరే విజయ్ కుమార్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో కార్యాలయంలో నారాయణ సార్ సంస్మరణ దినోత్సవం జరుపుకున్నారు. ఉపాధ్యాయ సంఘం నేతగా ఉద్యోగులకు ప్రయోజనం చేయడమే కాకుండా రైతు సమస్యలపై ఆయన అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘం నాయకులు నందిరామయ్య, రాజన్న, ఆకుల సుదర్శన్, సర్వోత్తమ్ రెడ్డి, మురళి, హరిత, ఎస్ఎం రెడ్డి తదితరులు ఉన్నారు.