14 April, 2026 | 4:18 AM

బోర్డు తిప్పేసిన యూనిక్ మర్కంటైల్

14-04-2026 02:08 AM

ఉమ్మడి జిల్లాలో రూ.800 కోట్ల టోకరా

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం 

కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ మోసాలను మరువక ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్ మర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 800 కోట్లకు టోకరా వేసింది.

అధిక లాభాలు అంటూ ఆశ చూపి అధిక మొత్తంలో పెట్టుబడులు సేకరించి బోర్డు తిప్పేయడంతో పెట్టుబడులు పెట్టిన బాధితులు లబోదిబోమం టున్నారు. మల్టీనెట్ వర్కింగ్ సంస్థ యూనియన్ ఎస్‌ఎంసీఎస్ పేరుతో భారీ ఎత్తున జిల్లావాసుల నుంచి డి పాజిట్లు, ప్రీమియం వసూలు చేసింది. పెట్టి న మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని ఆశచూపడంతో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడిదారులు పెద్ద మొత్తం లో పెట్టుబడులు పెట్టారు.

భారీ ఎత్తున డ బ్బులు వసూలు చేసిన అనంతరం యూనిక్ మర్కంటైల్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సంస్థ కు తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టా రు. కాగా బాధితులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నగరంలోని టీఎన్టీవో ఫంక్షన్ హా ల్‌లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యం లో యూనిక్ బాధితులు ఇటీవల సమావేశం నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో బాధి తులు హాజరై తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితుల డబ్బులను వెంటనే తిరిగి చెల్లించాలని, ఆలస్యం చేసే విధానాలను పూ ర్తిగా ఆపాలని, మోసగాళ్లను కఠిన చర్యలు తీ సుకోవాలని నాయకురాలు పూజిత డి మాండ్ చేశారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఏఐఎఫ్బీ సీనియర్ నాయకుడు అంబటిరెడ్డి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.ఉద్యమా న్ని, బాధితులను పక్కదారి పట్టించే వారి పై కేసులు నమోదు చేయిస్తానని, బాధితులకు రక్షణ కవచంలా నిలబడతామని తెలిపారు.