25 August, 2026 | 3:41 AM

జిల్లా ఎస్‌పీని కలిసిన పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

25-08-2026 12:00 AM

శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్‌పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 24 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన కార్యవర్గం పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలకు జిల్లా పోలీసు శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ తెలిపారు.

నూతన కార్యవర్గం అధ్యక్షులుగా గూగులోతు నరేష్, ఎస్బి కానిస్టేబుల్, భూపాలపల్లి, ఉపాధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్, మహాదేవపూర్. ఎస్ సాంబమూర్తి, ఎస్‌ఐ, మహాదేవపూర్, కార్యదర్శిగా బి అశోక్, ఎస్‌ఐ, ఘనపూర్, జాయింట్ సెక్రటరీగా ఎ రమేష్, పీసి, మహాముత్తారం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ సతీష్, పీసి ఘనపూర్, కోశాధికారిగా ఓ చిన్నన్న, కానిస్టేబుల్, పీసీఆర్, భూపాలపల్లి ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా బి సతీష్, భూపాలపల్లి, డి శ్రావణ్, పీసి, పలిమెల, పి విజయ్, పీసి, మొగుళ్లపల్లి, ఎం. అంబిక, పీసి, మహాముత్తారం, ఎం యాదిరెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, భూపాలపల్లి, క్రాంతి, ఏఆర్ పీసి భూపాలపల్లి ఎన్నికయ్యారు.