25 August, 2026 | 1:42 AM

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి

25-08-2026 12:02 AM

ప్రజావాణిలో సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ వినతి

గణపురం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మండలంలోని  పరుశురాంపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ సోమవారం గణపురం ప్రజావాణిలో ఇంచార్జ్  ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరుశురాంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు.

ఈ విషయమై ఆగస్టు 14న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో  చర్చించినప్పటికీ, ఆగస్టు 21న జారీ చేసిన అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్లో పరుశురాంపల్లి ఖాళీ పోస్టును చేర్చలేదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ ఇన్చార్జి  ఎంపీడీవో కు విజ్ఞప్తి చేశారు.