calender_icon.png 21 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి చూపు మందగిస్తుందా?

21-09-2025 12:11:51 AM

మీకు ఎప్పుడైనా మీ కంటిచూపు మసకబారుతోందని, రంగులు వెలసినట్లు కనిపిస్తున్నాయని, లేదా గతంలో కంటే ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందని, మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ లక్షణాలు కంటి శుక్లం యొక్క ప్రారంభ సంకేతాలు కావచ్చు. ఈ సమస్య చాలా సాధారణమైనప్పటికీ ఇది చికిత్స చేయగల కంటి వ్యాధి. మీ కంటిలోని స్పష్టమైన కంటి లెన్స్‌పై తెల్లటి పొరలు వ్యాపించినపుడు కంటి శుక్లం వస్తుంది. దీనివల్ల స్పష్టంగా చూడటం చాల ఇబ్బందికరంగా మారుతుంది. హైదరాబాద్ నిజాంపేట్‌లోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో అత్యుత్తమ నేత్రవైద్య నిపుణురాలు డాక్టర్ తుశారా అలూరి.. కంటి శుక్లాలని త్వరగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను మరియు దృష్టిని కాపాడటానికి సకాలంలో శస్త్రచికిత్స ఎంత కీలకమో వివరిస్తున్నారు.

అంధత్వానికి ఇదే ప్రధాన కారణం..!

భారతదేశంలో, ముఖ్యంగా వృద్ధులలో, కంటి శుక్లం చికిత్స చేయగలిగే అంధత్వానికి ప్రధాన కారణంగా ఉంది. దీన్ని అధిగమించడానికి, భారతదేశం 2022 రికార్డు స్థాయిలో 83.4 లక్షల కంటి శుక్లానికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. ప్రస్తుతం సంవత్సరానికి ఒక్క మిలియన్ జనాభాకు సుమారు 3,000 శస్త్రచికిత్సల రేటు అవసరం ఉన్నప్పటికీ, చికిత్స పొందని కేసుల రేటుని తగ్గించడానికి 2030 నాటికి కనీసం 30% వృద్ధి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

దృష్టి లోపానికి ప్రధాన కారణం

కంటి శుక్లాలు భారతదేశంలో దృష్టి లోపానికి ప్రధాన కారణం, అయితే సకాలంలో శస్త్రచికిత్సతో వాటిని పూర్తిగా నయం చేయవచ్చనేది శుభవార్త. దీనికి చికిత్సను ఆలస్యం చేయడం వల్ల దృష్టి మరింత దిగజారడమే కాకుండా వ్యక్తి భద్రత, స్వాతంత్య్రం మరియు మొత్తం జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో నిపుణులైన కంటి సంరక్షణ బృందం అధునాతన కంటి శుక్ల నిర్ధారణ, తాజా ఇంట్రాఓక్యులర్ లెన్స్ టెక్నాలజీతో శస్త్రచికిత్సను అందిస్తారు. మీ కంటిచూపు మరియు జీవన నాణ్యతను కాపాడుకోవడానికి వీలైనంత త్వరగా సంప్రదింపులను బుక్ చేసుకోండి.

కంటి శుక్లాల ఎందుకు ఏర్పడుతాయి?

కంటి శుక్లాలు కంటి యొక్క సహజ లెల్స్‌ను ప్రోటీన్లు ఒకదానితో ఒకటి గుమిగూడినప్పుడు ఏర్పడతాయి. దీనివల్ల చూపు మసకబారుతుంది. దీనికి వృద్ధాప్యం అత్యంత సాధారణ కారణం అయితే, మధుమేహం, ధూమపానం, దీర్ఘకాల సూర్యరశ్మికి గురికావడం, లేదా గతంలో కంటి గాయాలు వంటివి ఇతర ప్రమాద కారకాలు. ఈ లక్షణాలు తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. చూపు మందగించడం, రాత్రిపూట సరిగా కనిపించకపోవడం, మరియు అధిక కాంతికి చూడలేకపోవడం వంటివి సాధారణ సంకేతాలు.

శస్త్రచికిత్సను ఆలస్యం చేస్తే నష్టాలు

స్పష్టంగా చూడగలిగే దృష్టి లోపం: కంటి శుక్లాలు కాలక్రమేణా తీవ్రమవుతాయి. చికిత్స చేయకపోతే, రోగులు చివరికి తీవ్రమైన దృష్టి లోపం లేదా పూర్తి అంధత్వానికి గురవుతారు. ఇది వారి రోజువారి జీవనం మరియు వారి కదలికపై ప్రభావం చూపుతుంది.

ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంటుంది: బలహీనమైన దృష్టి ముఖ్యంగా వృద్ధులలో పడిపోవడం మరియు రహదారి ప్రమాదాలని గణనీయంగా పెంచుతుంది. శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన కంటిచూపు ఈ ప్రమాదాలను బాగా తగ్గిస్తుంది.

క్లిష్టమైన శస్త్రచికిత్స: కంటి శుక్లాలను ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి మరింత దట్టంగా మారతాయి. అధికమైన కంటి శుక్లాలను తొలగించడం మరింత కష్టతరం మరియు శస్త్రచికిత్స సమయంలో మరిన్ని సమస్యల సంభావ్యతను పెంచుతుంది.

మానసిక ప్రభావం: దృష్టి సమస్యల వలన చదవడం, వంట చేయడం, లేదా డ్రైవింగ్ చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకంగా ఉంటుంది, దీనివల్ల నిరాశ, ఇతరులపై ఆధారపడటం మరియు డిప్రెషన్ వంటివి సంభవించవచ్చు.

సరైన సమయంలో కంటి శుక్ల శస్త్రచికిత్స 

స్పష్టమైన దృష్టి: శస్త్రచికిత్స మసకబారిన కంటి లెన్స్‌ను కృత్రిమ ఇంట్రాఓక్యులర్ లెన్స్‌తో భర్తీ చేస్తుంది. స్పష్టమైన దృష్టి మరియు రంగుల గ్రహణ శక్తిని పునరుద్ధరిస్తుంది.

మెరుగైన జీవన నాణ్యత: రోగులు నిరంతరమైన ఒత్తిడి లేకుండా అభిరుచులు, సామాజిక కార్యకలాపాలు మరియు వారి పనిని తిరిగి ప్రారంభించవచ్చు.

సమస్యల ప్రమాదం తగ్గుతుంది: ముందుగానే ఆపరేషన్ చేయడం వలన సురక్షితమైన చికిత్స, మరియు వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుంది.

నష్టాన్ని నివారించడం: చికిత్స చేయని కంటి శుక్లాలు కొన్నిసార్లు గ్లాకోమా మరియు శాశ్వత దృష్టి లోపానికి దారితీస్తాయి.

శుక్ల చికిత్సపై అపోహలు, వాస్తవాలు

అపోహ: శస్త్రచికిత్సకు ముందు కంటి శుక్లాలు పరిణితి చెందాలి.

వాస్తవం: చికిత్స కొరకు వేచి ఉండటం అనవసరం అంతే కాకుండా అది చాల ప్రమాదకరం. ముందస్తు శస్త్రచికిత్స సురక్షితమైన మరియు మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

అపోహ: శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా దృష్టిని మరింత దిగజార్చవచ్చు.

వాస్తవం: కంటి శుక్ల శస్త్రచికిత్స ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన మరియు అత్యంత సాధారణ శస్త్రచికిత్సలలో ఒకటి, దీనికి అధిక సక్సస్ రేటు ఉంది.

అపోహ: కోలుకోవడానికి నెలలు పడుతుంది.

వాస్తవం: చాలామంది రోగులు కొన్ని రోజుల్లోనే దృష్టి మెరుగుపడటాన్ని గమనిస్తారు. కొన్ని వారాల్లోనే సాధారణ కార్యకలాపాలకు తిరిగి నిర్వహిస్తారు.

రా డాక్టర్ తుశారా అలూరి, ఉత్తమ నేత్ర వైద్య నిపుణులు, నిజాంపేట్, హైదరాబాద్,  శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్.