7 April, 2026 | 9:04 PM

గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వర

07-04-2026 07:27 PM

 బ్రహ్మోత్సవ భక్టోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ఈవో 

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవ భక్తోత్సవాలఏర్పాట్లను ఆలయ ఈవో శశిధర్, ఉత్సవ కమిటీ సభ్యులు  మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ భక్టోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శశిధర్, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

9వ తేదీన స్వస్తి వాచనంలతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 10న వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, బేరి పూజ, 11 తేదీన స్వామివార్ల ఎదుర్కోళ్లు, సీతారామ ఉమామహేశ్వర కళ్యాణం, 12న పోన్న సేవ, నంది వాహన సేవ, భద్రకాళి పూజ, 13న అగ్నిగుండాలు, గరుడసేవ, కొనసాగి 14వ తేదీన  స్వామివారి పుష్ప రథోత్సవం,  పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగంతో ముగుస్తాయని  తెలిపారు.

ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు  కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు జితేందర్ రావు, చిలివేరి జనార్ధన్, రామాలయం ప్రధాన అర్చకులు బీటుకూరి శ్రీనివాసచార్యులు,  శివాలయం అర్చకులు మఠం   శివకుమార్  తదితరులు పాల్గొన్నారు.