సీఎం రేవంత్‌రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ భేటీ
20-09-2025 12:28 AM
- పలు అంశాలపై చర్చ
- ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించిన సీఎం
- సమావేశంలో పాల్గొన్న గవర్నర్ సతీమణి, న్యూజెర్సీ ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ పిలిప్ డి . ముర్సీ ఢిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ ( సినిమారంగం ), మౌలిక వసతులు ( మెట్రో, పట్టణ రవాణా ), మూసీ రివర్ ప్రంట్ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ విజన్ -2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యతను కూడా వివరించారు. ఈ భేటీలో గవర్నర్ సతీమణి , న్యూజెర్సీ ప్రతినిధులు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.






