calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

20-09-2025 12:29:33 AM

తప్పుడు రిజిస్టేషన్ చేశారంటూ ఆందోళన

పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ ఆందోళన

తూప్రాన్: మెదక్ జిల్లా మనోహరాబాద్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.  దొంగ రిజిస్టేషన్ చేసి తల్లిని రోడ్డుపాలు చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఒక దశలో బాధితురాలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడతానని బెదిరించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  మనోహరబాద్ మండల పరిధిలోనీ అగ్రహారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంగా మాధవి భర్త రాములు అనారోగ్యంతో చనిపోయాడు. 

ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు గౌరీ శంకర్ గతంలో చనిపోగా, చిన్న కుమారుడు కుమార్ పని చేస్తున్న వద్ద గోడకులి చనిపోవడంతో కుమార్ పేరుమీద ఉన్న భూమిని తల్లి మాధవి ప్రమేయం లేకుండా కోడలు పేరు మీద చేశారని తాసిల్దార్ కార్యాలయంలో ఆందోళన చేశారు. భర్త, ఇద్దరు కుమారులు చనిపోగా తాను అనాథగా మారానని రోధించింది. ఈ విషయమై తహసిల్దార్ ఆంజనేయులును వివరణ కోరగా చట్ట ప్రకారం భర్త పేరు మీద ఉన్న ఆస్తిని అతను చనిపోతే భార్యకి చెందడం చట్టం. దీనికి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కాబట్టి పలు మార్లు నోటీసులు జారీ చేసి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చట్టం ప్రకారం చేశామని  తెలిపారు.