20-09-2025 12:28:06 AM
ఎమ్మెల్యే మందుల సామేల్
నూతనకల్ సెప్టెంబర్ 19 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కో కో ఆటలను ప్రారంభించారు, అనంతరం క్రీడలలో పాల్గొంటున్న విద్యార్థులచే ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడలలో జాతీయస్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి , ఎంఈఓ రాములు నాయక్,తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత,ఆయా పాఠశాలల పీఈటీలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.