31 March, 2026 | 1:48 PM

Breaking News

చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •   అకాల వర్షం కుభీర్ ను కుదిపింది… రైతుల కష్టార్జితం నేలమట్టం   •  

ప్రతిపక్షం లేకుండా చేద్దామనే కొత్త చట్టాలు

03-07-2024 12:33 AM

హాజీపూర్ ఘటన కలిచివేసిందన్న వీహెచ్.. 

నాలుగేళ్లవుతున్నా న్యాయమేదంటూ ఆవేదన

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఎన్డీయే ప్రభుత్వం ప్రతిప క్షాలను అణదొక్కేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టు ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆందోళన వ్యక్తంచేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో  ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోలేనిదన్నారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ కేసులో న్యాయం జరగలేదన్నారు.

ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన నిందితుడిని శిక్షించాలని నల్లగొండ కోర్టు  తీర్పు ఇచ్చిందని.. డీజీపీ కేసును సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్లు  పేర్కొన్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో వాస్తవాలు మాట్లాడారని, హిందువుల మధ్య విద్వేషాలు పెంచొద్దని, హింసను ప్రోత్సహించొద్దని ఆయన సూచించారన్నారు. న్యాయం కోసం రాహుల్ మాట్లాడితే.. ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు.