18 July, 2026 | 4:26 AM

వచ్చుండాయ్ పీలింగ్సూ..

02-12-2024 01:34 AM

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సునీల్, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినమా నుంచి ఆదివారం ‘పీలింగ్స్’ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఆరింటికోసారి ఏడింటికోసారి పదింటికోసారి.. పడుకుంటె ఓ సారి మెలకుంటె ఓ సారి ఏమి తోచక కూసుంటె ఓ సారి.. ఏలు పట్టుకుంటె ఓ సారి కాలు తొక్కుతుంటె ఓసారి నువ్వు పక్కనుంటె ప్రతిసారీ.. వచ్చుండాయ్ పీలింగ్సూ..’ అంటూ సాగుతున్న ఈ సాంగ్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న కెమిస్ట్రీ పండింది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ గీత సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, లక్ష్మిదాస పాడిన ఈ గీతం తొలుత మలయాళం లిరిక్స్‌తో మొదలై తర్వాత తెలుగు లిరిక్స్‌తో కొనసాగుతుంది.