02-10-2025 02:07:21 AM
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ మాస్ మహారాజ అభిమానులతోపాటు సినీప్రియుల్లోనూ ఆసక్తిని పెంచాయి.
ఇప్పుటికే టీమ్ ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు వాయిదా వేసింది. చివరగా ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త విడుదల తేదీని తెలియజేసేందుకు ఓ ప్రత్యేక వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఈ వీడియో సరదాగా నవ్వులు పంచుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విధు అయ్యన్న; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; మాటలు: నందు సవిరిగాన; కూర్పు: నవీన్ నూలి; కళా దర్శకత్వం: శ్రీనాగేంద్ర తంగాల.