సంగారెడ్డి జిల్లాలో కొత్త పంచాయతీలు
- 11 పంచాయతీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సంగారెడ్డి, ఆగస్టు 24 (విజయక్రాంతి): గ్రామాల్లో మెరుగైన పరిపాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు నోటిఫినేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 11 కొత్త పంచాయతీల ఏర్పాటు నోటిఫికేషన్ రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 28 మండలాలు, 647 పంచాయతీలు ఉన్నాయి.
కొత్తగా 11 పంచాయతీలు ఏర్పాటుకానున్నాయి. సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్(బి), ఆందోల్ మండలంలోని కొండరెడ్డి పల్లితండా, వట్‌పల్లి మండలంలోని లక్యానాయక్ తండా, రాయికోడ్ మండలంలోని ఎన్నికేపల్లి, న్యాల్‌కల్ మండలంలోని తాట్‌పల్లి, నారాయణఖేడ్ మండలంలోని హను మన్ మందిర్‌తండా, లింగాయ నాయక్ తం డా, గుండుతండా, సిర్గాపూర్ మండలంలో ని పాఠ్యనాయక్ తండా, నాగుల్‌గిద్ద మండలంలోని ఉమలతండా, శ్యామానాయక్ తం డా పంచాయతీలుగా ఏర్పాటుకానున్నాయి.






