మోడల్ స్కూల్‌కు నూతన ప్రిన్సిపాల్
08-08-2026 01:43 AM
చేవెళ్ల, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణ మోడల్ స్కూల్ చేవెళ్ల నూతన ప్రి న్సిపాల్‌గా మహేశ్వర రావు నియమితులయ్యరు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన చిన్నపురెడ్డి చేవెళ్ల ఆదర్శ పాఠశాలలో జూలై 31న పదవి విరమణ పొందారు. శంకర్పల్లి ఆదర్శ పాఠశాలలో ఇన్చార్జి ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తించి బాటనీ టీచర్గా బదిలీపై వచ్చిన డా. మహేశ్వర రావు చేవెళ్ల ఆదర్శ పాఠశాలకు ప్రిన్సిపల్ గా నియమితులయ్యరు. ఆయనను సాదరంగా ఆహ్వాని స్తూ.. శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది సన్మానించారు.






