8 August, 2026 | 2:56 AM

అల్ఫోర్స్ జెన్ నెకస్ట్‌లో ఘనంగా ‘మాన్సూన్ మస్తీ’

08-08-2026 01:42 AM

ముకరంపుర, ఆగస్టు 7 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ జెన్ నెకస్ట్ క్యాంపస్ లో శుక్రవారం ‘మాన్సూన్ మస్తీ‘ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాదారు.

విద్యార్థులకు వినోదాత్మకంగా విద్యను బోధించినట్లయితే, విషయాలను చాలా సులభంగా గుర్తుపెట్టుకోవడమే కాకుండా పలు పోటీ పరీక్షలలో సైతం ఘనవిజయాలను నమోదు చేస్తారని అన్నారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.