calender_icon.png 31 July, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు

30-07-2025 04:35:17 PM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి..

నిర్మల్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో మండలానికి చెందిన 12 గ్రామ పంచాయతీలకు చెందిన 588 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రేషన్ కార్డు లేని అర్హులందరూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నా కళ్యాణి, నాయకులు రావుల రాంనాథ్, తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, చంద్రకాంత్, వీరేష్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, శైలేష్, విక్రమ్, మధుకర్, మల్లేష్, అచ్యుత్ రావ్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

దిలావర్ పూర్ మండల కేంద్రంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, చంద్రకాంత్ వీరేష్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, శైలేష్ తో పాటు మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.