30-07-2025 04:32:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): 'బాల కార్మిక రహిత తెలంగాణకు బాటలు వేద్దాం పిల్లల్ని పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం' పోస్టర్ రోలర్ సొసైటీ నిర్వాహకులు జున్ను అనిల్ తెలిపారు. బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే బాల కార్మిక నిషేధ & నియంత్రణ చట్టం 2016 ప్రకారం పిల్లల్ని పనిలో పెట్టుకుంటే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా రూ 20,000 నుండి 50 వేల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు.
ఇంటి పనుల కొరకు పిల్లలను నిర్బంధంలో ఉంచడం హక్కుల ఉల్లంఘన అవుతుంది. అంతేగాక వెట్టిచాకరీ నిర్మూలన చట్టం 1976 ప్రకారం కూడా శిక్షహరులు బాలల సంక్షేమ సమితి సభ్యులు ఎల్. సైమన్సుందర్, జన్ను అనిల్, సల్ల శ్రీలత, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ విడుదల చేశారు. ఇందులో విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు హారిక, రజిత, అనురాధ, మరియు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, రాజకుమార్, పద్మ, శ్రీదేవి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.