calender_icon.png 3 December, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా రేషన్ దందా..!

03-12-2025 12:13:58 AM

-ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బస్తాకు కిలో పైనే తరుగు

-ఈ ఏడాది ఆరు లక్షల బియ్యం తరుగు..? 

-కోట్ల రూపాయల బియ్యం ఏమవుతున్నట్లు...? 

మంచిర్యాల, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచి తంగా రేషన్ బియ్యాన్ని అందజేస్తుంది. రేషన్ (ఎఫ్‌ఎస్సీ) కార్డులోని ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున, అంత్యోధయ (ఏఎఫ్‌ఎస్సీ) కార్డు కింద ఎన్ని యూనిట్లు ఉన్న 35 కిలోలు, అన్నపూర్ణ (ఏఏపీ) కార్డు కింద ఎన్ని యూని ట్లు ఉన్న కార్డుకు పది కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా రేషన్ దుకాణాలకు వచ్చే బియ్యం బస్తాలు 50 కిలోల లోపు వస్తుండటంతో నెల నెలా పెద్ద మొత్తంలో రేష న్ కోల్పోతున్నామని రేషన్ డీలర్లు వాపోతు న్నారు. జిల్లాలోని 423 రేషన్ దుకాణాలకు అధికారికంగా (పేపర్ లెక్కల్లో) రావాల్సిన కోటా బియ్యం వస్తుండగా భౌతికంగా తక్కువ వస్తుండటంతో లోటు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందజేస్తుంది.

జనవరి నెలలో 2,19,152 కార్డుదారులకు 3651.994 మెట్రిక్ టన్నులు, ఫిబ్రవరి నెలలో 2,19,426 కార్డుదా రులకు 3632.019 మెట్రి క్ టన్నులు, మార్చి నెలలో 2,19,392 కార్డుదారులకు 3619.626 మెట్రిక్ టన్నులు, ఏప్రిల్ నెలలో 2,19,106 కార్డుదారులకు 3777.158 మెట్రిక్ టన్నులు, మే నెలలో 2,20,055 కార్డుదారులకు 3862.099 మెట్రిక్ టన్నులు, జూన్ నెలలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 2,23,844 కార్డుదారులకు ఒకే సారి 6,381. 712 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ నెలలో 2,48,387 కార్డుదారులకు 1943.697 మెట్రి క్ టన్నులు, అక్టోబర్ నెలలో 2,51,392 కార్డుదారులకు 1946.558 మెట్రిక్ టన్నులు, నవంబర్ నెలలో 2,52,386 కార్డుదారులకు 1949.722 మెట్రిక్ టన్నులు ఇలా ఈ ఏడాది 11 నెలల్లో 30,764.585 మెట్రక్ టన్నుల బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులకు అంద జేశారు. డిసెంబర్ నెల మూమెంట్ ప్రస్తుతం నడుస్తోంది.

ఆరు లక్షల బియ్యం తరుగు..? 

ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వెళుతున్న బియ్యం బస్తా తూకం తక్కువగా వస్తోంది. ఒక బస్తా 50 కిలోలు, సంచి బరువు సుమారు 600 గ్రాములతో కలిపి 50.600 కిలోలు ఉండాలి. కానీ రేషన్ దుకాణాలకు వెళుతున్న బస్తాల్లో కొన్ని 47.300 కిలోలు, కొన్ని 48.180 కిలోలు, మరికొన్ని కొన్ని 49.500 కిలోలు, ఇలా ప్రతీ బస్తా 50 కిలోలకు తక్కువగానే వస్తున్నాయి. ఈ లెక్కన ప్రతీ బస్తా సుమారు కిలో తక్కువగానే తూకం వస్తుంది.

ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుంచి రేషన్ షాపు దుకాణా దారుడు తన షాపునకు వచ్చే బియ్యానికి ఒక చోట తంబ్ వేసి వెళుతుండగా, తూకం వేసిన బియ్యం బస్తాలు కాకుండా గోదాముల్లోని బియ్యం సంచులను లారీల్లో లోడ్ చేసి పంపి స్తున్నారు. ఆ బస్తాల్లో కనీసం 50 కిలోలు కూడా ఉండకపోవడంతో ప్రతీ రేషన్ దుకా ణాదారుడు క్వింటాళ్ల కొద్ది రేషన్ నెల నెలా నష్టపోవాల్సి వస్తుంది.

ఈ ఏడాది ఇప్పటి వర కు 30.764.585 మెట్రిక్ టన్నుల (3,07, 64,585 కిలోల) బియ్యం సరఫరా అయ్యా యంటే దాదాపు 6,15,290  (50 కిలోల) బస్తాల బియ్యం రేషన్ దుకాణాలకు తరలిం చినట్లు లెక్క. బస్తాకు కిలో తరుగు వస్తుం దంటే దాదాపు ఆరు లక్షల 15 వేల 290 కిలోల బియ్యం రేషన్ దుకాణాలకు చేరడం లేదనేది స్పష్టమవుతుంది.

కోట్ల రూపాయల బియ్యాన్ని ఎవరు తింటున్నారు...?

జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి 423 రేషన్ దుకాణాలకు బియ్యం తరలు తుంది. బస్తా తూకంలో దాదాపు కిలో వ్యత్యా సం వస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల కిలోలు దుకాణాదా రులకు చేరలేదు. ప్రభుత్వం కిలోకు 34 రూపాయల వరకు చెల్లించి మిల్లర్ల వద్ద నుంచి కొనుగోలు చేసి పేదలకు పంచి పెడుతుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే లక్షల కిలోల తరుగు బియ్యం ఎక్కడ మాయమవుతుందో అర్థం కావడం లేదు.

జిల్లాలోని ఎస్ డబ్ల్యూ ఎస్ గోదాం పాటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల తదితర జిల్లాల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి స్టేజ్ - 1 కాంట్రాక్టర్ లారీల ద్వారా జిల్లాలోని ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం తీసుకువ స్తుంటారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి 423 రేషన్ దుకాణాలకు తరలిస్తుంటారు.

ఇదంతా బాగానే ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లేసరికి బస్తాకు కిలోకి పైగా తరుగు ఎందుకు వస్తుందనేది మిస్టరీగా తయారైంది. ఎస్ డబ్ల్యూసీ గోదాంకు మిల్లరే తక్కువ పెడుతు న్నారా..? సివిల్ సప్లయ్ శాఖ ఇచ్చిన ఆర్‌ఓ ప్రకారం కాకుండా స్టేజ్ - 1 నుంచి స్టేజ్-  2 కి తక్కువ వస్తుందా..? మధ్యలో బస్తాలు మాయమవుతున్నాయా..?

ఆర్‌ఓలో తూకం ప్రకారం బస్తాలు వచ్చినా ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుంచి తూకం ప్రకారం కాకుం డా బస్తాల ప్రకారం పంపడం వల్ల తరుగు వస్తుందా..? అనేది సంబంధిత శాఖ అధికా రులు పరిశీలన చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కోట్ల రూపాయల విలువ చేసే లక్షల కిలోల బియ్యం ఏమైనట్లో పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.