calender_icon.png 3 December, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెబొగుడ తండా సర్పంచ్, పాలకవర్గం ఏకగ్రీవం

03-12-2025 12:14:31 AM

ఏకగ్రీవమైన పాలకవర్గాన్ని సన్మానించిన గ్రామస్తులు

నాగిరెడ్డిపేట, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పల్లెబొగుడతండా గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.గ్రామ సర్పంచ్గా ధనవత్ పార్వతిశంకర్, ఉప సర్పంచ్‌గా వినీత వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామస్థులు తెలిపారు. వార్డు సభ్యులుగా ధనావత్ గోవింద్, ఆంబోతు ముత్యాలి, రాందాస్, సునీత, శాంత, బలరాం, సేవుల కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకవర్గం ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.