calender_icon.png 6 December, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విత్తన చట్టం అవగాహన

06-12-2025 04:31:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నూతన విత్తన చట్టం–2025పై వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లకు జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే విత్తన చట్టం–2025 గురించి కీలక అంశాలను డీలర్లకు వివరించారు. ప్రస్తుత విత్తన చట్టం–1966తో పోల్చి కొత్త చట్టంలో అమలుకాబోయే మార్పులు, నియమ నిబంధనలు, డీలర్లు పాటించవలసిన విధానాలను స్పష్టంగా వివరించారు.

కొత్త విత్తన చట్టంపై డీలర్లకు ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉన్నా అవి రాతపూర్వకంగా డిసెంబర్ 11, 2025 లోపల జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇ-మెయిల్‌ అడ్రెస్‌కి పంపించాలని అధికారులు చెప్పారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డీలర్లు కొత్త చట్టం అమలులో తమ సందేహాలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు రైతులకు మేలు చేసే విధంగా చట్టం ప్రభావం, అమలు పద్ధతులపై సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ కుమార్, మనోహర్, మండల వ్యవసాయ అధికారులు, జిల్లాలోని విత్తన డీలర్లు పాల్గొన్నారు.