06-12-2025 04:27:08 PM
పాల్గొన్న జిల్లా ఎస్పీ నితికా పంత్..
కాగజ్ నగర్ (విజయక్రాంతి): రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి–భద్రతల పరిరక్షణను మరింత బలపరచే లక్ష్యంతో శనివారం కాగజ్‌నగర్ పట్టణంలో పోలీసు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో మార్చ్ కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరగడానికి పోలీస్ భద్రత పూర్తిచేసినట్లు తెలిపారు.
ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి పరిస్థితులను పర్యవేక్షించడం, ఎన్నికల సమయంలో అసాంఘిక అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం అని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజ భద్రతలకు భంగపరిచే ఏ చర్యలకైనా జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వాహీదుద్దీన్, సీఐలు టౌన్ ప్రేమ్ కుమార్, కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, సందీప్, కళ్యాణ్, సందీప్, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.