అబ్దుల్లాపూర్‌మెట్‌కు కొత్త షటిల్ బస్సులు
- ప్రతి 15 నిమిషాలకు సర్వీసులు
ఆర్టీసీ హయత్నగర్1 డిపో మేనేజర్ విజయ్
ఎల్బీనగర్, ఏప్రిల్ 7 : హయత్నగర్ పరిసర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా షటిల్ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు ఆర్టీసీ హయత్నగర్1 డిపో మేనేజర్ విజయ్ తెలిపారు. పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టు, బాటసింగారం, కొత్తగూడెం ప్రాంతాలకు అఫ్జల్గంజ్‌ఎ, ల్బీనగర్ నుంచి ప్రత్యేక షటిల్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
అఫ్జల్గంజ్ నుంచి కొత్తగూడెం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సమయాల్లో బస్సులు నడుస్తాయని, తిరుగు ప్రయాణంలో కూడా అదే విధంగా సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో ఆధార్ కార్డు ద్వారా ప్రయాణానికి అనుమతి ఉందని తెలిపారు. ప్రయా ణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారు.




