01-05-2025 01:09:58 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించినట్టు న్యూజెన్ స్కూల్ చైర్మన్ రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మా పిల్లల శ్రమ, టీచర్ల నిబద్ధత, తల్లిదండ్రులకు మా పైన ఉన్న నమ్మకంతోనే ఈ ఫలితాలు సాధించినట్టు చెప్పారు.
577, 573, 572 మార్కులతో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని, 18 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారని చెప్పా రు. 200 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వంద శాతం ఫలితాలు వచ్చాయని తెలిపారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం సంతోషాన్నిచ్చిందన్నారు.