01-05-2025 01:08:33 AM
ఏ.ఎస్.రావు నగర్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): పదవ తరగతి ఫలితా ల్లో ఏఎస్ రావు నగర్ లోని భాష్యం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కన బరిచారు. ఈ. రక్షిత్ 591 మార్కులు, ఎం మేఘన 586, బి రోహిత్ 582 మార్కులు సాధించి తమ ప్రతిభ చాటారు.
భాష్యం విద్యా ప్రణాళిక, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన వల్ల తాను 591 మార్కులు సాధించగలిగానని రక్షిత్ తెలిపారు. సీఈవో చైతన్య, జెడ్ ఇ ఓ మా ర్కండేయులు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సంబరాలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అమరేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.