నిజానిజాలు రాయవల్సిన పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి
ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే కావాలని చెడు ప్రచారం చేస్తున్నారు..
చెడు ప్రచారం రాసిన పత్రికను తీవ్రంగా కండించిన కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల ఇంచార్జి జాడి రాంబాబు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీతక్కపై బురద జల్లాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల ఇంఛార్జి జాడి రాంబాబు(Mandal Incharge Jadi Rambabu) ఒక ప్రకటనలో అన్నారు. పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసి కమిషన్ దందా చేసిందే కాకుండా ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే కావాలని నాగన్న అనే డమ్మీ పేరుతో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ మీద కావలనే చెడు ప్రచారం రాసిన పేపరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
అనంతరం జాడి రాంబాబు మాట్లాడుతూ... జీవో 49ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి మంత్రి సీతక్క అని, జీవో 49 విడుదల చేయగానే వెంటనే ఎస్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జీవో 49కి వ్యతిరేకంగా సీతక్క తీర్మానం చేశారని, నిజ నిజాలు తెలియకుండా మావోయిస్టులు కూడా సీతక్కని కలుపుతూ లేఖ రాయడం దురదృష్టం అని, మావోయిస్టు లేఖలో కేవలం సీతక్క అధికారంలో ఉండి జీవో 49ను అడ్డుకోవాలి అని రాస్తే కావాలని కొందరు ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికతో కలిసి కమిషన్ల కోసం ములుగు అడవులను అదానీ, అంబానీలకు మంత్రి సీతక్క తాకట్టు పెడుతున్నారని రాయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొన్ని పత్రికలు రాయడం సిగ్గుచేటని, నిజాలు రాయాల్సిన పత్రికలు కూడా ప్రతిపక్ష నాయకుల మత్తులో పడి అసత్యపు రాతలు రాయడం అవమానకరమని, ప్రజలకు, పాలకులకు వారధిగా ఉండాల్సిన పాత్రికేయులే అసత్యపు ప్రచారాలు చేయడం బాధాకరమని, ప్రతి అక్షరం ప్రజల కోసం రాసే పత్రిక సోదరులు సీతక్క గురించి అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపద దోచుకోవడానికి అడ్డుగా ఉన్న మావోయిస్టులను కనికరం లేకుండా కాల్చి చంపుతుంటే ఒక్క పత్రిక కూడా ప్రశ్నించట్లేదని, అదానీ, అంబానీలను బీజేపీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుండి పెద్దపెద్ద వ్యాపారాలకు అండగా నిలుస్తూ రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు, 42వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ, రైతన్నకు ఒక్క లక్ష రూపాయల పంట రుణం కూడా మాఫీ చేయకపోయినా కూడా ఒక్క పత్రిక అడగట్లేదని పాకిస్తాన్ తీవ్రవాదులను ట్రంప్ కోసం క్షమించి యుద్ధం వదిలేసిన మోడీ మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు అని ఎందుకు అడగలేకపోతున్నారని, క్షమాభిక్ష కోసం సంధి కోసం బీజేపీ ప్రభుత్వాన్ని మావోయిస్టులు కోరుతున్న కావాలని కనికరం లేకుండా బీజేపీ ప్రభుత్వం చంపడం దారుణమని, అయిన ఏ ఒక్క మీడియాలో రాదు, ఏ ఒక్క పత్రిక రాయదని, కానీ ములుగు అడవుల్లో ఏదో ఉన్నట్లు కనికట్టు చేసి, రేవంత్ రెడ్డి, సీతక్క కీర్తిని దెబ్బతీసేలా రాయడం నిజంగా సిగ్గుచేటని, అదానీ, అంబానీలను పెంచి పోషించింది బీజేపీ ప్రభుత్వమని, ఛత్తీస్ ఘడ్ అడవుల ఖనిజ సంపద కోసం ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టులను హత్యలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని, సీతక్క ఎప్పుడైనా తను ఎక్కడున్నా నిజం వైపు నిలబడుతుందని అడవి బిడ్డ సీతక్క అడవులను కాపాడుకుంటుంది, అడవి బిడ్డలకు అండగా ఉంటుందని, అంతేకాని కమిషన్ల కోసం, ఆస్తుల కోసం సీతక్క అడవిని నాశనం చేసే నాయకురాలు కాదని అన్నారు.




