calender_icon.png 3 July, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరుకాపు వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్‌కు ఘన సన్మానం

02-07-2025 06:02:13 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం(Telangana Munnuru Kapu State Association) వర్కింగ్ ప్రెసిడెంట్ గా చల్ల హరిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్ సూదుల వెంకటరమణ మాట్లాడుతూ... "సంఘానికి నిబద్ధతతో సేవలందించిన హరిశంకర్ నాయకత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆయన ఆలోచనలు, కార్యకలాపాలు మున్నూరుకాపు సామాజిక, ఆర్థిక పురోగతికి దిక్సూచి కావాలని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.

మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ... ఇది గౌరవమేగాక బాధ్యతను మరింత పెంచే సందర్భమని, రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు బంధువుల ఐక్యత, సంక్షేమం కోసం నా శక్తిమేర సేవ చేస్తాను. జర్నలిస్టుల నుంచి వస్తున్న అభినందనలు నాకు ప్రోత్సాహంగా నిలుస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు బోనాల తిరుమల, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్, టియుడబ్ల్యూజె అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, బోనాల వెంకటేష్, రఘు, సుగుణాకర్, మడిపల్లి శ్రీనివాస్, మంద శ్రీనివాస్, హరికృష్ణ, చల్ల కృష్ణ, సుమప, మధు పాల్గొన్నారు.