02-07-2025 06:11:54 PM
వాజేడు (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వాజేడు పరిధిలో గల కేజీబీవీ హాస్టల్లో జిల్లాఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం వాజేడు వైద్యులు మధుకర్(Doctor Madhukar) ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. దగ్గు తలనొప్పి ఉన్నవారికి పరీక్షించి తగిన మందులు పంపిణీ చేశారు. శిబిరంలో 44 మంది విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు, ఇద్దరు విద్యార్థులకు రక్తపూత సేకరణ ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వసతిగృహం పరిసరాలను పరిశీలించి తనిఖీ చేశారు. అనంతరం వంటశాలను పరిశీలించారు. ఆహార పరిశీలనలో భాగంగా పాఠశాల పిల్లలకు వండిన వంటకాలతో వైద్య సిబ్బంది మధ్యాహ్నం భోజనం చేశారు.