calender_icon.png 20 May, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

20-05-2025 01:50:04 PM

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. జూన్5న విచారణకు రావాలని కేసీఆర్ కు నోటీసుల్లో తెలిపారు. కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) కు నోటీసులు పంపారు. జూన్ 6న విచారణకు రావాలని హరీశ్ రావుకు నోటీసులు తెలిపారు. జూన్ 9న విచారణకు రావాలని ఈటల రాజేందర్ కు నోటీసులు పంపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. కేసీఆర్ హయాంలో నీటిపారుదలశాఖ మంత్రిగా తన్నీరు హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.