calender_icon.png 20 May, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత ఆత్మహత్య

20-05-2025 01:28:59 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కానిస్టేబుల్ వేధింపులు తాళలేక ఓ వివాహేత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణ పరిధిలోని వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణి (32)ని వరుసకు మరిది అయ్యే నాగరాజు అనే కానిస్టేబుల్ బేధింపులకు పాల్పడుతూ, అతని వద్ద ఉన్న ఫోటోలను బంధువులకు పంపి పరువు తీశాడని మనస్థాపంతో త్రివేణి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాగరాజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగారం గ్రామానికి చెందిన కానిస్టేబుల్. మృతరాలు తండ్రి ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసులు కేసు నమోదు తయారు చేస్తున్నారు.