20-05-2025 01:38:05 PM
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) మంగళవారం నాడు పర్యటిస్తున్నారు. సింగరేణి వీటీసీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు పెంచుకోవాలని తెలిపారు. నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు సూచించారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సర్వే(Statewide skill survey) ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్, మంథిని నియోజకవర్గాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.