30 June, 2026 | 8:22 AM

23,500 టార్గెట్ వైపు నిఫ్టీ

27-05-2024 12:05 AM

మార్కెట్లో ఈ వారమూ పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని టెక్నికల్స్ సూచిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. వీక్లీ చార్టుల్లో హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మేషన్‌తో పాటు లాంగ్ బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాట్రన్ ఏర్పడటం సానుకూలాంశమని వివరించారు. కొద్ది రోజుల్లో నిఫ్టీ రైజింగ్ ఛానల్‌లో అప్పర్‌బ్యాండ్ అయిన 23,100 23,200 శ్రేణిని చేరుతుందని, ఆ శ్రేణిపైన స్థిరపడితే 23,500 పాయింట్ల లక్ష్యాన్ని అందుకుంటుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేశారు.  22,800 శ్రేణి వద్ద కీలకమైన మద్దతు ఉన్నదని తెలిపారు. కాస్త భిన్నమైన అంచనాల్ని మరో విశ్లేషకుడు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే వెల్లడిస్తూ గత శుక్రవారం 23,000 స్థాయిని నిఫ్టీ దాటిన తర్వాత సైడ్‌వేస్‌లో ట్రేడయినందున, వచ్చే కొద్ది రోజులూ సెంటిమెంట్ నిస్తేజంగా ఉంటుందన్నారు. 22,950 పాయింట్ల మధ్య కదలవచ్చని, 22,950 పాయింట్ల స్థాయిని కోల్పోతే 22,800 వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు. మరోవైపు 20,050 పాయింట్ల స్థాయిని అధిగమిస్తే అర్థవంతమైన ర్యాలీ జరిగే ఛాన్స్ ఉన్నదన్నారు.