27 July, 2026 | 2:50 AM

సౌత్ సెంట్రల్ రైల్వే టీంలో సెంచరీ చేసిన నిహాల్ రెడ్డి

27-07-2026 02:10 AM

హైదరాబాద్, జూలై 26 (విజయ క్రాంతి): హైదరాబా ద్‌లోని స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్స్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే మరియు యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండు రోజుల క్రికెట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే టీం 305 పరుగులు చేసింది. హైదరా బాద్‌కు చెందిన నిహాల్ రెడ్డి 117 బంతుల లో మూడు సిక్స్‌లు, పది ఫోర్‌లతో 111 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. గుగు లోత్ చంటి 60 బంతులలో 9 ఫోర్లతో, అర్ద సెంచరీ సాధించాడు. రేపు మ్యాచ్ కొనసా గనుంది.