25 August, 2026 | 3:20 PM

దవాఖానకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

14-03-2025 02:06 AM

కుమార్తె మృతి.. తల్లికి తీవ్రగాయాలు

మునుగోడు, మార్చి 13 :  తల్లీకూతుళ్లు దవాఖానకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందగా తల్లికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలివి.. మునుగోడు మండలం కచలాపురం  గ్రామానికి చెందిన జంగా సుజాత (42) చీకటిమామిడి గ్రామానికి చెందిన తన తల్లి తోటకూర యాదమ్మకు అనారోగ్యంగా ఉండడంతో చికిత్సకోసం మునుగోడుకు తీసుకెళ్లింది.

వైద్యం చేయించుకొని సాయంత్రం 7 గంటల తరువాత బంధువైన యువకుడి బ్పై చికటిమామిడికి తిరుగు ప్రయాణమయ్యారు. మునుగోడు శివారుకు రాగానే బైక్ అదుపుతప్పి గేదెను ఢీకొట్టింది. దీంతో తల్లీకూతుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సుజాత మృతి చెందింది. భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.