16-06-2025 12:31:38 AM
నిర్మల్, జూన్ 15 (విజయక్రాంతి): నిర్మ ల్ దేవ్ భాయ్ హాస్పిటల్‌కు చెందిన ప్రము ఖ గైనకాలజిస్ట్, సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక కాసావార్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆమె అందిస్తున్న సేవలను గుర్తిస్తూ సుమన్ టీవీ యాజమాన్యం రాష్ట్రస్థాయి అవార్డును ఆదివారం అందజేసింది.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్లకు సుమన్ టీవీ యాజమాన్యం అవార్డులతో సత్కరించింది. డాక్టర్ చంద్రిక కాసావార్ సంతాన సాఫల్య నిపుణురాలిగా ఎంతోమంది పిల్లలు లేని దంపతులకు తన ట్రీట్మెంట్ ద్వారా సంతా నం కలిగేలా చేస్తున్నారు. దూర ప్రాంతాలవారికి ఆన్‌లైన్ ద్వారా వైద్య సూచనలు చేస్తున్నారు.