పూరి బయలుదేరిన నిర్మల్ ఆర్టీసీ బస్సు
08-03-2026 05:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ నుండి అన్నవరం, సింహమాచలం, అర్సవెల్లి, కోణార్క్, పురిజగన్నాథ్, ద్వారకా తిరుమల ప్రత్యేక యాత్ర బస్సును డిపోమేనేజర్ కే పండరి ప్రారంభించారు. ఈ యాత్ర 6 రోజులు సాగుతుందని తెలిపారు. యాత్ర బస్సులకు ప్రయాణికుల నుండి మంచి స్పందన ఉండని ఎప్రిల్ మాసంలో అయోధ్య, కాశి,రామేశ్వరం, గోవా టూర్ లు పెడతామని ప్రయాణికులు ఇలాగే ఆదరించాలని ఆయన కోరారు. కార్యక్రమములో అసిస్టెంట్ మేనేజర్ దేవాపాల, ఎస్.టి. ఐ.శకుంతల స్టేషన్ మేనేజర్ వి.జి.రెడ్డి. నానీ, టి. వి.రమణ భక్తులు పాల్గొన్నారు.




