13 March, 2026 | 11:33 AM

ఇందిరమ్మ ఇల్లు భూమి పూజలో పాల్గొన్న కట్ట కొమ్ము తండా సర్పంచ్

08-03-2026 05:23 PM

దేవరకొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు భూమి పూజలో పాల్గొన్న కట్ట కొమ్ము తండా సర్పంచ్ నేనవత్ జ్యోతి పాండు నాయక్ ఆదివారం భూమి పూజలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సహకారంతో కొర్ర లాలీకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందన్నారు. లబ్ధిదారురాలు ఇంటి కల నెరవేరేలా చేయడం మా ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి ఇళ్లు అందిస్తున్నారని అన్నారు  ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ సభవత్ లక్ష్మి గోవింద్ వార్డ్ మెంబర్ సాగర్ నాయక్ గ్రామ సెక్రటరీ శ్రీనివాసులు మాజీ ఉపసర్పంచ్ దేవుల యువ నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.