08-11-2025 12:00:00 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, నవంబర్ 7 : ప్రభుత్వ వైద కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ , నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి లతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ , హెచ్ ఓ డి లు,అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు.
తమను ఎవరు ర్యాగింగ్ చేయ లేదని, స్నేహపూర్వక వాతావరణంలోనే తాము ఉన్నామని విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ , స్థానిక ఆర్డిఓ అశోక్ రెడ్డి ,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపక బృందం ఉన్నారు.