08-11-2025 12:00:00 AM
బిచ్కుంద, నవంబర్ 7 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ యోగేష్ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు.
చౌడేకర్ సంతోష్ యమున దంపతుల కుమారుడైన యోగేష్ 2020-21 సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో గోల్ మెడల్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మారుమూల మద్నూర్ గ్రామం యోగేష్ బంగారు పథకం సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.