30-12-2025 04:35:55 PM
వైభవంగా రథయాత్ర నిర్వహించాము...
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు, గతంలో ఏప్పుడు లేని విధంగా మంగళవారం స్వామివారి రథయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని సుల్తానాబాద్ పట్టణం లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ వల్ల మురళీధర్ అన్నారు.
మంగళవారం ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, డైరెక్టర్ ముస్త్యాల శ్రీదేవి- రవీందర్ దంపతులు, శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయిరి మహేందర్-పద్మ దంపతులు, చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు-పద్మ, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి డైరెక్టర్ సామల యమున-హరికృష్ణ దంపతులు, వికాస తరంగిణి సభ్యులు సాదుల సుగుణాకర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, మునిసిపల్ కమిషనర్ రమేష్ , జర్నలిస్ట్ ముంజ శ్రీనివాస్ , అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.