30-12-2025 04:39:47 PM
వాంకిడి,(విజయక్రాంతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ బంబార గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజి అన్నారు. మంగళవారం బంబార గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టిన పనులను ఉప సర్పంచ్ జాడి సంతోష్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదవారికి ఇంటిని నిర్మించి ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లను అందిస్తు న్నట్లు తెలిపారు. అలాగే ఈజీఎస్ పథకం ద్వారా దిశా మోడల్ పాఠశాలకు మంజూరైన నూతన వంటశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈజీఎస్ ఈసీ మోసిన్, టిఏ ప్రభాకర్, పాఠ శాల హెచ్ఎం కే.దేవ్ రావు, ఎఫ్ఎ రాము, సిబ్బంది ఉన్నారు.