21-12-2025 12:00:00 AM
ముంబై , డిసెంబర్ 20 : టీ20 ప్రపంచకప్ ముంగిట వైస్ కెప్టెన్ శుభమన్ గిల్‌పై వేటు పడుతుందని చాలా మంది అనుకోలే దు. సంజూ కెరీర్ బలిచేస్తున్నారని విమర్శ లు వచ్చినా వైస్ కెప్టెన్ కావడంతో మెగాటోర్నీకి అతనుండడం ఖాయమని భావించారు. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గిల్‌పై వేటు వేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కారణాలను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. టీమ్ కాంబినేషన్ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు.
కాంబినేషన్ కారణంగానే గిల్‌ను తప్పించక తప్ప లేదని చెప్పుకొచ్చాడు. జట్టులో 15 మందినే ఎంపిక చేయగలమనీ, అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు టీమ్‌కు దూరం కావాల్సి ఉం టుందన్నాడు. గిల్ ఎంతటి క్వాలిటీ ప్లేయరో అందరికీ తెలుసనీ, కాంబినేషన్ కారణంగానే అతనికి చోటు దక్కలేదన్నాడు.
గత ప్రపంచకప్ సమయంలోనూ ఇదే కారణంతో గిల్‌కు ప్లేస్ లేదని గుర్తు చేశాడు. కాగా గిల్ లేకపోవడంతో అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ అప్ప గించామని తెలిపాడు. టాపార్డర్‌లో ఆడే వికె ట్ కీపర్ కావాలని భావించడంతో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ను తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇక జైశ్వాల్‌కు ప్లేస్ దక్కకపోవడంపైనా అగార్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో 10 మం ది పేర్లు చర్చకు వచ్చాయని, తమకు మరో ఆప్షన్ లేదన్నాడు.