calender_icon.png 21 December, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహ్లీ ప్రాక్టీస్ షురూ

21-12-2025 12:00:00 AM

విజయ్ హజారే టోర్నీకి రెడీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వచ్చే వారం నుంచి దేశవాళీ క్రికెట్ బరిలో చూడొచ్చు. డొమెస్టిక్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం విరాట్ సన్నద్ధమవుతున్నాడు. దీని కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి లండన్ లోనే ఉంటున్న కోహ్లీ భారత్ వన్డే సిరీస్ లు ఉన్నప్పుడు మాత్రం వచ్చి జట్టుతో కలుస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ వరుస 2 సెంచరీలతో దుమ్మురేపా డు.

మునుపటి కోహ్లీని గుర్తు చేస్తూ అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం  ఇటీవల ప్రకటించిన ఢిల్లీ జట్టులో కోహ్లీ కూ డా ఉన్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో కింగ్ ఆడబోతున్నాడు. కోహ్లీ చివరిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. దాదాపు 15 ఏళ్ళ తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగుతున్న కోహ్లీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.