calender_icon.png 21 December, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్రాళ్లు టైటిల్ పట్టేస్తారా ?

21-12-2025 12:00:00 AM

  1. నేడు అండర్ 19 ఆసియాకప్ ఫైనల్
  2. పాక్‌తో భారత్ తుది పోరు

దుబాయి, డిసెంబర్ 20 : అండర్ 19 ఆసియాకప్‌లో టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూ సుకొచ్చిన భారత యువజట్టు, పాకిస్తాన్‌తో టైటిల్ పోరులో తలపడబోతోంది. లీగ్ స్టేజ్ లో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్ అదే జోరు కొనసాగించి టైటిల్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ పూర్తి ఫామ్‌లో ఉండడంతో తుదిపోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్ ప్లేస్‌లో నిలిచిన భారత యువ జట్టు సెమీస్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలున్నాయి. కొన్ని మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన వైభవ్ సెమీస్‌లో నిరాశపరిచాడు. అయితే ఫైనల్లో వైభవ్ చెలరేగితే మాత్రం భారీస్కోరు ఖాయం. యూఏ ఈపై 95 బంతుల్లోనే 171 పరుగులు చేశా డు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ అభిగ్యాన్ కుందు మలేషియాపై ఏకంగా డబుల్ సెం చరీ బాదేశాడు.

ఇక కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో పాటు హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్‌పై అంచనాలున్నాయి. వీరితో పాటు దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ బంతితో రాణిస్తున్నారు. మరోవైపు పాక్ అండర్ 19 జట్టు లీగ్ స్టేజ్‌లో భారత్‌పై ఓటమి తప్పిస్తే మిగిలిన మ్యాచ్‌లలో ఆకట్టుకుంది. ఫామ్, బలా బలాల పరంగా చూస్తే భారత్‌ను ఓడించాలంటే పాక్ అంచనాలకు మించి రాణించా ల్సిందే. కాగా అండర్ 19 ఆసియాకప్‌లో భారత్ ఇప్పటి వరకూ 8 సార్లు చాంపియన్‌గా నిలిచింది. చివరిసారిగా 2021లో అండర్ 19 ఆసియాకప్‌ను గెలుచుకుంది.