9 July, 2026 | 8:35 PM

అండర్‌పాస్‌లు వద్దు.. ఫ్లుఓవర్లు ముద్దు

26-06-2024 01:44 AM

ఎల్బీనగర్, జూన్ 25 : వనస్థలిపురం పనామా చౌరస్తాలో చేపడుతున్న అండర్ పాస్ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడు తూ.. దుర్గా విలాస్ నుంచి ఆటోనగర్ వరకు నిర్మించే అండర్‌పాస్ నిర్మాణాలతో రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు నిలిచిపోతాయని, ఫలితంగా వందలాది మంది రోడ్డున పడతారన్నారు. మన్సూరాబాద్, సహరా రోడ్డులో ఉన్న కాలనీలకు జాతీయ రహదారి వరకు రోడ్డు సౌకర్యం తెగిపోతుందన్నారు. జాతీయ రహదారిపై అండర్‌పాస్‌లకు బదులు ఫైఓవర్లు నిర్మించాలని కోరా రు. ఈ విషయంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కొత్త రవీందర్‌గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పారంద మహేశ్, కార్పొరేటర్లు  కొప్పుల నర్సింహరెడ్డి, నవజీవన్‌రెడ్డి, బద్దం ప్రేమ్‌మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.